క్రీమీ ఫ్రూట్ సలాడ్
కావలసినవి
ఫ్రెష్ క్రీమ్ - 2 కప్పులు
అరటిపళ్లు - 2
వెనిలా ఎసెన్స్ - 3 చుక్కలు
నిమ్మరసం - అర చెంచా
దానిమ్మ గింజలు - అర కప్పు
పంచదార పొడి -అర కప్పు
యాపిల్ -1
నల్లద్రాక్షలు - అర కప్పు
తయారీ :
ముందుగా ఒక గిన్నెలో క్రీమ్, పంచదార పొడి వేసి హాండ్ బ్లెండర్ తో నురగ వచ్చేలా బ్లెండ్ చెయ్యాలి. తరువాత యాపిల్, అరటిపళ్ళు చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వాటిపై నిమ్మరసం కలపాలి. ఇప్పుడు పళ్ళ ముక్కలు, ద్రాక్షపళ్లు, దానిమ్మ గింజలు, వెనిలా ఎసెన్స్ క్రీమ్‌లో వేసి స్పూన్ తో బాగా కలిసేలా కలపాలి. తరువాత ఒక అరగంట ఫ్రిజ్ లో పెట్టుకోవాలి. సర్వ్ చేసేముందు ద్రాక్షా,దానిమ్మగింజలు వేసి డెకరేట్ చేస్తే పిల్లలు చాల ఇష్టంగా తింటారు...
|