శ్రీరామనవమి స్పెషల్ రెసిపి
పానకం
కావాల్సినవి
నీళ్లు - లీటర్
బెల్లం. - 100 గ్రాములు
యాలుకలు - నాలుగు
మిరియాలు. - నాలుగు
తయారీ :
ముందుగా యాలుకల పైన తొక్క తీసేసి గింజల్నిపౌడర్ చేసి పెట్టుకోవాలి. తరువాత మిరియాలని పౌడర్ చేసి ఇప్పుడు రెండిటిని నీళ్లల్లో కలిపి తరువాత బెల్లం కూడా మెత్తగా చేసుకుని నీళ్ళల్లో వేసి బాగా కలపాలి.
వడపప్పు
కావలసినవి:
పెసరపప్పు - అర కప్పు
పచ్చిమిర్చి తరుగు - ఒక స్పూన్
కొత్తిమీర తరుగు - టీ స్పూన్
కొబ్బరి తురుము -టేబుల్ స్పూన్
ఉప్పు - తగినంత
తయారీ :
పెసరపప్పును నాలుగు గంటలు నీళ్లలో నానబెట్టాలి. నీటిని వడకట్టేసి, పప్పు ఒక గిన్నెలో వేయాలి. దాంట్లో పచ్చిమిర్చి, కొత్తిమీర, కొబ్బరి, ఉప్పు వేసి కలపాలి.
చలిమిడి
కావలసినవి:
బియ్యం - 300 గ్రాములు(గంటసేపు నీళ్లలో నానబెట్టి, ఆరాక, పిండి చేయాలి)
నెయ్యి - ఒక కప్పు
ఇలాచి పొడి - అర టీ స్పూన్
జీడిపప్పు - 20
ఎండుకొబ్బరి తురుము - అర కప్పు
బెల్లం తురుము - 150 గ్రాములు
గసగసాలు - రెండు స్పూన్లు
తయారీ :
ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టి గసగసాలు వేసి వేయించి తీసి దానిలోనే నెయ్యి వేసి, వేడయ్యాక కొబ్బరి తరుగు, కట్ చేసిన జీడిపప్పు పలుకులు వేయించుకోవాలి. తరువాత మరో గిన్నెను స్టవ్ మీద పెట్టి నీళ్లు పోసి మరిగించాలి. అందులో బెల్లం వేసి, లేత పాకం పట్టాలి.ఇప్పుడు స్టవ్ సిమ్లో పెట్టి, బెల్లం పాకంలో బియ్యం పిండి, జీడిపప్పు, కొబ్బరి, ఇలాచి పొడి, గసగసాలు వేసి ముద్దలు లేకుండా బాగా కలిపి చివరిలో నెయ్యి వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసి వేడి తగ్గాక,చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి.
|