వెజిటెబుల్ ఉతప్పం
కావల్సినవి:
మినపప్పు - ఒక కప్పు
బియ్యం - 2 కప్పులు
ఉల్లిపాయలు -3
పెసర పప్పు - అర కప్పు
టొమటొ - 2
బీన్స్ - కట్ చేసినవి ఒక కప్పు
క్యారట్ తురుము-1 కప్పు
సెనగ పప్పు - అర కప్పు
పచ్చి మిర్చి -3
బఠాణీలు - అర కప్పు
ఉప్పు- తగినంత
నూనె- తగినంత
తయారి:
ముందుగా బియ్యం,మిగిలిన పప్పులన్ని ముందు రోజు నానబెట్టుకొని తరువాత రోజు మెత్తగా గ్రైండ్ చేసుకుని పెట్టుకోవాలి. తరవాత బీన్స్ , బఠాణీలు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయలు,టొమటోలు కట్ చేసి పెట్టుకోవాలి.తరువాత స్టవ్ వెలిగించి పాన్ పెట్టి కొద్దిగా నూనె వెసి వేడెక్కాక పచ్చిమిర్చి,ఉల్లిపాయ ముక్కలు వేసి మగ్గాక ,టొమటో ముక్కలు, బఠాణీలు ,బీన్స్ వేసి మగ్గించాలి. కొద్దిసేపు ఆగి ఉప్పువేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తరువాత ఈ కర్రీ ని దోసల పిండిలో కలుపుకుని అరగంట ఆగాకా స్టవ్ వెలిగించి పెనం పెట్టి ఉతప్పం వేసి నూనె వేసి కాల్చుకోవాలి. చట్నీతో వేడి వేడి గా సర్వ్ చేసుకోవాలి...
|