ములక్కాడ కుర్మా
కావలసినవి :
మునక్కాడలు - నాలుగు
చింతపండు పేస్ట్ - రెండు చెంచాలు
ఉల్లిపాయలు - రెండు
టమాటాలు-రెండు
అల్లం - చిన్నముక్క
జీలకర్ర, ఆవాలు-అరచెంచా
కారం-తగినంత
కరివేపాకు-రెండు రెబ్బలు
పచ్చిమిర్చి-మూడు
కొత్తిమీర - కొద్దిగా
ధనియాలపొడి, - ఒక స్పూన్
గరంమసాలా- ఒక స్పూన్
నూనె-సరిపడా
శనగపిండి- రెండు స్పూన్లు
ఉప్పు- తగినంత
తయారుచేసే విధానం :
ముందుగా మునక్కాడలు, టమాట, ఉల్లిపాయలు తరిగి ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ పెట్టి ఆయిల్ వేసి వేడి చేసి జీలకర్ర, ఆవాలు కరివేపాకు, పచ్చిమిర్చి, అల్లం, ఇంగువ వేసి వేయించాలి. తరువాత ఉల్లిపాయ ముక్కలు వేసి మగ్గాక టమాట ముక్కలు వేసి రెండు నిముషాల తరువాత మునక్కాడలు ముక్కలు వేసి వేగాక అందులో ఉప్పు ,కారం ధనియాల పొడి, గరం మసాలా, చింతపండు పేస్ట్ వేసి కలిపి రెండి నిముషాల తరువాత శనగపిండి వేసి సరిపడా నీళ్ళు పోసి ఐదు నిముషాలు ఉడికించాలి. గ్రేవీ చిక్కగా అయ్యాక స్టవ్ ఆఫ్ చేసి బౌల్ లోకి తీసుకుని వేడి వేడి రిసె తో సర్వ్ చేసుకోవాలి.
|