మునగకాయ మటన్ గ్రేవీ కర్రీ
కావలసిన వస్తువులు:
మటన్: ఒక కేజీ
మునగకాయలు: 4
టమాటాలు: 2
ఉల్లిపాయ: 2
కరివేపాకు: 2రెబ్బలు
అల్లం వెల్లుల్లి పేస్ట్ : 2 స్పూన్స్
పసుపు: ఒక స్పూన్
కారం: 2 స్పూన్స్
కొబ్బరి : అర ముక్క
దాల్చిన చెక్కా, లవంగం పొడి: 1స్పూన్
యాలకులపొడి: 1 స్పూన్
ఉప్పు: తగినంత
గరం మసాలా పొడి: 1 tsp
నూనె: సరిపడా
తయారీ :
ముందుగా మునగకాయలు కావలసిన సైజు లో ముక్కలుగా కట్ చేసుకుని పెట్టుకోవాలి. తరువాత పాన్ పెట్టి లో నూనె వేడి చేసి సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసి వేయించాలి. ఇప్పుడు కరివేపాకు, పసుపు, అల్లం వెల్లుల్లి ముద్ద వేసి కొద్దిసేపు వేయించాలి. తర్వాత కారం పొడి, కొబ్బరి పేస్ట్, దాల్చిన చెక్కాలవంగం, యాలకులపొడి వేసి కలపాలి. తర్వాత కడిగి శుభ్రం చేసుకున్న మటన్ ముక్కలను వేసి కొద్దిగా మగ్గిన తరువాత ఉప్పు , కారం వేసి బాగా వేగనివ్వాలి. ఇప్పుడు సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాట ముక్కలు ,మునగకాయ ముక్కలు వేసి కూడా వేసి మెత్తబడేవరకు వేయించి సరిపడా నీళ్లు పోసి కలిపి మూతపెట్టి 15 నిమిషాలు ఉడికించి ఇప్పుడు మూత తీసి గరం మసాలా కలిపి రెండు నిముషాలు ఉంచి స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని రైస్ తో సర్వ్ చేసుకోవాలి..
|