కరాచి హల్వా రెసిపి
కావలసిన పదార్థాలు :
కార్న్ ఫ్లోర్ - 100 గ్రాములు
నెయ్యి - 75 గ్రాములు
పంచదార - 250 గ్రాములు
రెడ్ కలర్ - చిటికెడు
యాలకుల పొడి -అర స్పూన్
బాదాం, జీడిపప్పు - పావు కప్పు ( అన్నిటిని సన్నగా కట్ చేసుకోవాలి)
తయారీ :
ముందుగా ఒక గిన్నె తీసుకుని సరిపడా నీళ్ళు పోసి పంచదార వేసి బాగా మరిగిన తరువాత స్టవ్ ఆఫ్ చేయాలి. ఇప్పుడు గిన్నె లోకార్న్ ఫ్లోర్ కొద్దిగా నీళ్ళు వేసి జారుగా కలుపుకోవాలి. తరువాత స్టవ్ వెలిగించి నాన్ స్టిక్ పాన్ పెట్టి నెయ్యి వేసి కరిగిన తరువాత కలిపి వుంచుకున్న పిండిని వేసి ఉండలు లేకుండా కలుపుకోవాలి. మిశ్రం దగ్గర పడ్డాక అందులో పాకం కొద్ది కొద్ది గా వేసి కలుపుకోవాలి. ఇప్పుడు కరిగించి స్పూన్ నెయ్యిలో రెడ్ కలర్ కలిపి హల్వాలో వెయ్యాలి. ఇప్పుడు ఇలాచి, జీడిపప్పు వేసి కలిపి చివరిలో నెయ్యి వేసుకోవాలి ఒక ఐదు నిముషాలు ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకుని నెయ్యి రాసిన ప్లేట్ లో హల్వా వేసి చల్లారక ముక్కలుగా కట్ చేసుకోవాలి.
|