చిల్లి చికెన్ రెసిపి
చాలా ఇష్టంగా తినే చిల్లి చికెన్ ఈజీగా చేసెయ్యొచ్చు.రైస్ లోకి సాంబారు,రసం వీటిలోకి తినడానికి బావుంటుంది.కొంచెం స్పైసీగా ఉంటేనే రుచి బావుంటుంది . ఇక చిల్లి చికెన్ కి కావలసిన పదార్ధాలు... తయారూ చేసే విధానం.
కావలసినవి:
చికెన్ : 1 కేజీ
పచ్చి మిరపకాయలు : 200 గ్రాములు
గరం మసాల : 1 స్పూన్
అల్లం ,వెల్లుల్లి పేస్ట్ : 3 స్పూన్స్
ఉల్లిపాయలు : 300 గ్రాములు
కారం : 3 స్పూన్స్
నూనె : తగినంత
యాలకులు : 5
పసుపు : 2 స్పూన్స్
తయారీ:
ముందుగా చికెన్ ను బాగా కడిగి అందులో కొంచం ఆయిల్ , కారం, పసుపు వేసి బాగా కలుపుకుని 10 నిమిషాలు నానబెట్టుకోవాలి. ఇప్పుడు పాన్ పెట్టి ఆయిల్ వేసి వేడెక్కిన తరువాత సన్నగా పొడవుగా కట్ చేసిన ఉల్లిపాయలు వేసి, అవి బ్రౌన్ కలర్ వచ్చినతరువాత దానిలో అల్లం, వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించి అందులో సరిపడా నీళ్ళు పొయ్యాలి. తరువాత నానబెట్టుకున్న చికెన్ వేసి ఉడికించుకోవాలి. ముప్పావ్ బాగం ఉడికాక కప్పు నీళ్ళు పోసి కలిపి కట్ చేసుకున్న పచ్చి మిర్చి, గరం మసాల వేసి 10 నిమిషాలు ఉడికించాలి.చివరిలో యాలకులు వేసి సర్వింగ్ బౌల్ లోకి తీసుకోవాలి.
|