గ్రీన్ చిల్లి చికెన్
కావలసిన పదార్థాలు:
చికెన్: అర కేజీ
టమోటో పేస్ట్ : 2 స్పూన్లు
ఉల్లిపాయలు: 2
అల్లం, వెల్లుల్లి పేస్ట్: 1టీ స్పూన్
పచ్చిమిర్చి: 10
మిరియాలు: పావు స్పూన్
లవంగం: 5
చెక్క: అంగుళం ముక్క
యాలకులు: 5
జీలకర్ర: 1స్పూన్
జీలకర్ర పొడి: 1స్పూన్
దనియా పౌడర్: 1స్పూన్
కొత్తిమీర: కొద్దిగా
మెంతులు: 1స్పూన్
నూనె: తగినంత
ఉప్పు: సరిపడా
తయారు చేయు విధానము:
ముందుగా చికెన్ శుభ్రం చేసుకొని ఒక బౌల్ లో వేసి అందులో టమోటో పేస్ట్, జీలకర్ర పొడి, దనియా పౌడర్, ఉప్పు వేసి బాగా కలిపి గంట సేపు ఫ్రిజ్ లో పెట్టాలి.ఇప్పుడుమిక్సీ లో పచ్చిమిర్చి, కొత్తిమీర, మిరియాలు, దాల్చిన చెక్క, లవంగం, యాలకులు మొంతులు వేసి గ్రైండ్ చేసి పెట్టుకోవాలి.
తరువాత పాన్ తీసుకొని అందులో ఆయిల్ వేసి వేడచేసి జీలకర్ర, కట్ చేసిన ఉల్లిపాయలు వేసి బ్రౌన్ కలర్ వచ్చె వరకు వేయించుకుని, అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. ఇప్పుడు నానబెట్టిన చికెన్ ను అందులో వేసి ఒక పది నిముషాలు కలుపుకుని గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలను సరిపడా నీళ్ళు పోసి పది నుంచి పదిహేను నిముషాలు ఉడికించి సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని కొత్తిమిర తో గార్నిష్ చేసి సర్వ్ చేసుకోవాలి
|