ఓట్స్ సాండ్‌విచ్ రెసిపి
కావలసిన వస్తువులు:
ఓట్స్ - 1/4 కప్పు
ఉప్పు - తగినంత
వెన్న - 4 టీ స్పూన్
వేయించిన జీలకర్ర - చిటికెడు
టమాటా సాస్ - 1 టీ స్పూన్
కొత్తిమిర - కొద్దిగా
గడ్డ పెరుగు - 1 కప్పు
క్యాప్సికమ్ తురుము - 2 టీ స్పూన్
బ్రెడ్ స్లైసులు - 6
నెయ్యి - 1 టీస్పూన్
మిరియాల పొడి - చిటికెడు
క్యారట్ తురుము - 3 టీ స్పూన్
తయారీ :
ముందుగా పెరుగును ఒక బట్టలో కట్టి నీరంతా తీసేసి పక్కన పెట్టుకోవాలి. తరువాత స్టవ్ వెలిగించి ప్యాన్ లో నెయ్యి వేడి చేసి ఓట్స్‌ని దోరగా వేయించుకోవాలి. గిన్నెలో వేయించిన ఓట్స్, క్యారట్ తురుము, క్యాప్సికమ్ తురుము, పెరుగు, టమాటా సాస్, మిరియాలపొడి, ఉప్పు, జీలకర్ర, కొత్తిమిర వేసి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. బ్రెడ్ స్లైసుల అంచులు తీసేసి వెన్న రాయాలి. దీనిమీద స్పూన్ పెరుగు, ఓట్స్ మిశ్రమాన్ని పరిచి ఇంకో వెన్న రాసిన బ్రెడ్ స్లైస్ తో మూసేసి పెనం మీద కొద్దిగా వెన్న వేసుకుని రెండు వైపులా బ్రౌన్ కలర్ వచ్చేవరకు కాల్చుకోవాలి
|