చైనీస్ పావ్ భాజీ
కావలసినవి:-
ఉల్లిపాయ తరుగు - అర కప్పు
ఉడికించిన బంగాళదుంప - 1
ఉడికించిన నూడుల్స్ - అర కప్పు
ఎండుమిర్చి - 4
క్యాబేజీ, క్యారట్, క్యాప్సికం, టొమాటో - అరకప్పు (సన్నగా తరిగినవి)
ఉప్పు - తగినంత
ఉల్లి కాడలు - పావు కప్పు
వెన్న - 2 టేబుల్ స్పూన్లు
వెల్లుల్లి - 5
టొమాటో సాస్ - 2 టీ స్పూన్లు
మిరియాలపొడి - అర టీ స్పూన్
నూనె - 2 టీ స్పూన్లు
అజినమోటో - చిటికెడు
ఉడికించిన కార్న్ గింజలు - పావు కప్పు
తయారీ :-
* ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టి అందులో నూనె వేసి సన్నగా తరిగిన ఉల్లిపాయ, వెజిటబుల్ ముక్కలు వేసి వేయించాలి.
* తర్వాత అజినమోటో వేసి కలిపి, ఎండుమిర్చి, వెల్లుల్లి పేస్ట్ టొమాటో సాస్, సోయా సాస్, మిరియాల పొడి, తగినంత ఉప్పు వేసి కలిపి కొద్దిసేపు ఉడికించాలి.
* ఇందులో ఉడికించిన బంగాళదుంప తురుము, నూడుల్స్, వెన్న, సన్నగా తరిగిన ఉల్లికాడలు వేసి మరో రెండు నిమిషాలు ఉడికించి దింపేయాలి.
* పావ్ బన్నును రెండుగా కట్ చేసుకొని వెన్న రాసి బ్రౌన్ కలర్ వచ్చె వరకు రెండు వైపులా కాల్చుకుని వేడి వేడి భాజితో సర్వ్ చేసుకోవాలి.
|