ఫిష్ మొయిలి కేరళ స్పెషల్
కావలసినవి :
చేప ముక్కలు - 500 గ్రాములు
ఉప్పు - రెండు స్పూన్లు
పసుపు - సరిపడా
మిరియాల పొడి - అర స్పూన్
ఆయిల్ - 100 గ్రాములు
ఉల్లిపాయలు - 2 (సన్నగా తరిగినవి)
అల్లం - 2 అంగుళాలు (తరిగినవి)
వెల్లుల్లి - 10,12 రెబ్బలు
పచ్చి మిర్చి - 2, 3 రెండుగా చీల్చినవి
ధనియాల పొడి - 2½ టేబుల్ స్పూన్
మెంతి పొడి - ½ టేబుల్ స్పూన్
కొబ్బరి పాలు - ఒక కప్పు
కార్న్ ఫ్లోర్ - ఒక స్పూన్
టమాటో - రెండు (సన్నగా కట్ చేసినవి)
కొత్తిమిర - ఒక కట్ట
తయారీ విధానం :
ముందుగా శుబ్రం చేసుకుని పెట్టుకున్న చేప ముక్కలకి ఉప్పు, పసుపు మరియు మిరియాల పొడి వేసి 30 నిమిషాలపాటు నానపెట్టుకుని ప్యాన్ లో ఆయిల్ వేసి వాటిని ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోవాలి.
ఇప్పుడు అదే ప్యాన్ లో మూడు స్పూన్ల ఆయిల్ వేసి ఉల్లిపాయముక్కలు, అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి ముక్కలు వేసి మగ్గాక టమాటో ముక్కలు కూడా వెయ్యాలి.
ఇప్పుడు అందులో పసుపు, ధనియాలు, మెంతిపొడి వేసి కలపాలి.
తరువాత కొబ్బరి పాలు కొన్ని, ఉప్పు వేసి కలపాలి.
తర్వాత ఫ్రై చేసిన చేప ముక్కల్ని వేసి పదిహేను నిముషాలు మూత పెట్టి ఉడకనివ్వాలి.
మిగిలిన కొబ్బరి పాలల్లో కార్న్ ఫ్లోర్ మిక్స్ చేసి ఉడుకుతున్న కర్రీ లో వేసి ఒక పది నిముషాలు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వింగ్ బౌల్ లోకి తీసుకోవాలి. ఇప్పుడు పైన కొత్తిమిర చల్లుకోవాలి....
|