వెరైటీ ఇడ్లి రెసిపిస్
ఓట్స్ ఇడ్లీ
కావలసినవి:
ఓట్స్, బియ్యం - ఒక కప్పు,
బియ్యం - కప్పు,
మినపప్పు - అర కప్పు,
మెంతులు - ఒక టీస్పూన్,
పచ్చిమిర్చి తురుము,
ఉప్పు - రెండు టీస్పూన్లు,
నూనె - కొద్దిగా.
తయారీ:
ముందుగా మినపప్పు, బియ్యంలను మెంతులు 4 గంటల ముందు నానపెట్టాలి. బియ్యం నాన పెట్టేటప్పుడే మెంతులు కూడా వేసుకోవాలి.ఓట్స్‌ను మాత్రం గ్రైండర్‌లో వేయడానికి 10 నిముషాల ముందు నానపెడితే సరిపోతుంది. మినపప్పును విడిగా రుబ్బుకున్నాక నానపెట్టిన బియ్యం, మెంతులు, ఓట్స్ కలిపి మెత్తగా రుబ్బాలి. చివరగా పచ్చిమిర్చి అన్నింటినీ కలిపి సరిపడా ఉప్పు వేసి రాత్రంతా వుంచి తరువాత రోజు ఇడ్లీల్లా వేసుకోవాలి.
కార్న్‌మీల్ ఇడ్లీ
కావలసినవి:
మొక్కజొన్న పిండి,- 2 కప్పులు
పెరుగు - 2 కప్పులు (పుల్లటి)
క్యారెట్ - ఒక కప్పు
కొత్తిమీర తరుగు- సరిపడా
కరివేపాకు- కొద్దిగా,
నూనె - రెండు టేబుల్ స్పూన్లు,
జీలకర్ర, ఆవాలు, పచ్చిశెనగపప్పు - ఒక్కో టీస్పూన్, బేకింగ్‌సోడా - చిటికెడు.
తయారీ:
ముందుగా స్టవ్ వేలిగించి గిన్నె పెట్టి నూనె వేసి , ఆవాలు, జీలకర్ర, పచ్చి శెనగపప్పులు వేసి వేగించాలి. క్యారెట్ తురుము, పెరుగు, ఉప్పు కరివేపాకు, కొత్తిమీర తరుగు వేసి బాగా కలిపి పావుగంట పక్కన పెట్టాలి. ఆ తరువాత నీళ్లు పోసి బేకింగ్ సోడా వేసి ఇడ్లీ పిండిలా కలిపి ఇడ్లీలు వేసుకోవాలి.
సేమియా ఇడ్లీ
కావలసినవి:
పెరుగు - రెండు కప్పులు,
బేకింగ్ సోడా - అర టీస్పూన్
ఉప్పు- రుచికి సరిపడా.
సన్నటి సేమియా - రెండు కప్పులు,
వేగించిన బొంబాయి రవ్వ - ఒక కప్పు,
నూనె - రెండు టీస్పూన్లు
ఆవాలు - అర టీస్పూన్,
పచ్చి శెనగపప్పు, - ఒక స్పూన్
మినపప్పు - ఒక టీస్పూన్,
కరివేపాకులు -కొద్దిగా
ఇంగువ - చిటికెడు.
తయారీ:
ముందుగా సేమియా ని వేయించుకుని బొంబాయి రవ్వ, బేకింగ్ సోడా, ఉప్పులను ఒక గిన్నెలో వేసుకుని పెరుగు వేసి ఇడ్లి పిండిలా కలపాలి. తరువాత స్టవ్ వెలిగించి నూనె వేడి చేసి ఆవాలు, శెనగపప్పు, మినపప్పులను వేగించి తరువాత కరివేపాకు, ఇంగువతో తాలింపు వేసి దీన్ని పిండిలో కలపాలి.ఒక పది నిముషాలు ఆగి ఇడ్లి లు వేసుకోవాలి.
|