చికెన్ రోస్ట్ రెసిపి
కావలసినవి:
చికెన్- అర కేజీ
మిరియాలు-1 టేబుల్‌స్పూన్
కొత్తిమీర-1 కట్ట
నూనె-సరిపడా
ఉప్పు-తగినంతఉల్లిపాయ-1
టమాటా-1
కారం-1 స్పూన్
ధనియాల పొడి-1స్పూన్
పసుపు-అర స్పూన్
ఆవాలు -కొద్దిగా
అల్లం ముక్క పెద్దది -1
వెల్లుల్లి పాయలు-15 రెబ్బలు
తయారుచేసే విధానం:
మిరియాలు, వెల్లుల్లి,అల్లం ను గ్రైండ్ చేసి పెట్టుకోవాలి.చికెన్‌ని కడిగి పక్కన పెట్టుకోవాలి. తరువాత స్టవ్ వెలిగించి పాన్ పెట్టి అందులో ఆయిల్ వేసి ఆవాలు , ఉల్లిపాయముక్కలు దోరగా వేగనివ్వాలి. ఆ తరువాత టమాటాలు, ఉప్పు వేసి మెత్తగా అయ్యే వరకు ఉడికించాలి. కారం, ధనియాల పౌడర్,పసుపు, వేసి కలపాలి. ఆ తరువాత చికెన్ వేసి సరిపడా నీళ్ళు ఉడికించాలి. పూర్తిగా ఉడికిపోయకా స్టవ్ ఆఫ్ చేసుకుని కొత్తిమిర వేసుకోవాలి
|