టమాట బాత్ రెసిపి
కావలసిన పదార్దాలు:
బొంబాయి రవ్వ : పావుకేజీ
టమాటాలు : 2
ఉల్లిపాయ : ఒకటి
పచ్చిమిర్చి : మూడు
పల్లీలు : టేబుల్ స్పూన్
ఆవాలు : అర టీ స్పూన్
నెయ్యి : రెండుటేబుల్ స్పూన్లు
కరివేపాకు : సరిపడా
అల్లం ముక్కలు : టీ స్పూన్
శెనగపప్పు : టీ స్పూన్
జీడిపప్పు : పది
పసుపు : చిటికెడు
ఉప్పు : తగినంత
తయారుచేయు విధానం:
* ముందుగా స్టవ్ వెలిగించి గిన్నెపెట్టుకుని రవ్వను వేయించుకుని తీసి పక్కన పెట్టుకోవాలి.
* తరువాత అందులోనెయ్యి వేసి వేడి అయ్యాక పోపుదినుసులు, కరివేపాకు, పల్లీలు
, జీడిపప్పులు వేసి వేగాక ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చిముక్కలు, పసుపు వేసి వేయించాలి.
* ఇప్పుడు టమాటముక్కలు కలపాలి.కొంచంసేపు వేయించి సరిపడా నీళ్ళు, ఉప్పు వేసి మూతపెట్టాలి.
* నీళ్ళు మరుగుతుండగా రవ్వవేసి కలపాలి. 5 నిముషాలు ఉడకనివ్వాలి.
|