చికెన్ 65 రెసిపి
కావలసినవి :
బోన్ లెస్ చికెన్- 1 kg
గరం మసాలా - 50 గ్రాములు
అల్లంవెల్లుల్లి పేస్టు - 200 గ్రాములు
కర్న్ ఫ్లోర్ - 2 కప్పులు
మైదా - 1 కప్పు
కోడి గుడ్డు - 4
అజినొమొటొ - 2 స్పూన్స్
కారం - తగినంత
ఉప్పు - తగినంత
నునె - సరిపడగా
కరివేపాకు - కొన్ని
పచ్చిమిరపకాయలు - 10
రెడ్ ఫుడ్ కలర్ - చిటికెడు
పెరుగు - 2 కప్పులు
తయారుచేసే పధ్ధతి:
ముందుగా ఒక బౌల్ లో చికెన్ , కర్న్ ఫ్లౌర్ , మైదా , అల్లంవెల్లుల్లి పేస్టు , గరం మసాలా , కారం , ఉప్పు , కోడిగుడ్డు , రెడ్ కలర్ , పెరుగు వేసి బాగ కలిపి గంటసేపు నానపెట్టాలి.
ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని గిన్నె పెట్టుకుని ఆయిల్ వేసుకుని కాగాక అందులొ నానాపెట్టుకున్న చికెన్ ముక్కలను ఒక్కొక్కటిగా అందులో వేసి వేయించాలి. ముక్కలను ప్లేట్ లోకి తీసుకోవాలి .
ఒక పాన్ లో కొంచం ఆయిల్ వేసి అందులొ కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు, కరివేపాకు అందులొ వేసి బాగా వేగాక,నిమ్మరసం వేసి , వేయించిన చికెన్ ముక్కలను వేసుకుని ఒక ఐదు నిముషాలు వేగనివ్వాలి.
|