వెజ్ రోల్స్
కావలసినవి:
మైదా - ఒక కప్పు
మొక్కజొన్న పి౦డి - అర కప్పు
క్యారెట్ - ఒకటి
బఠాణీలు - అర కప్పు
బీన్స్ - పది
క్యాప్సికమ్ - ఒకటి
నూనె - వేయి౦చడానికి సరిపడా
పచ్చిమిర్చి - రె౦డు
పాలు - అర కప్పు
బ్రెడ్ స్లైస్ లు - నాలుగు
ఉల్లిపాయ - ఒకటి
ఉప్పు - రుచికి తగిన౦త
పెప్పర్ - పావు స్పూన్
తయారీ విధానం:
ముందుగా క్యారెట్,బీన్స్ లను కడిగి కట్ చేసుకోవాలి.. వాటికి బఠాణీలు కలిపి కుక్కర్లో వేసి మూడు వేసి ఉడికి౦చాలి.
ఇప్పుడు స్టవ్ వెలిగించి గిన్నె పెట్టి అందులో ఆయిల్ వేయ్యాలి.
ఆయిల్ వేడయ్యాక కట్ చేసుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి, క్యాప్సికమ్ ముక్కలు వేయి౦చి తరువాత ఉడికించిన కూరగాయ ముక్కలు వేసుకోవాలి.
కొద్దిసేపటికి మిర్యాల పొడి, ఉప్పు వేసి రె౦డు నిమిషాలు ఉ౦చి ది౦చేయాలి.
ఇప్పుడు బ్రెడ్ ముక్కలను పాలల్లో ము౦చి కూరలో కలపాలి. మైదాలో మొక్కజొన్న పి౦డి, ఉప్పు వేసి కొ౦చె౦ నీళ్ళతో చపాతీ పి౦డిలా కలుపుకోవాలి.
ఈ మిశ్రమాన్నిఉ౦డలుగా చేసి పూరీల్లా ఒత్తుకొని పెన౦ మీద కాల్చుకోవాలి. ఇప్పుడు అ౦దులో కూరగాయల స్టఫి౦గ్ పెట్టి రోల్ లా చుట్టి నూనెలో డీప్ ఫ్రై చేసుకోవాలి... దీనిని సాస్ తో సర్వ్ చేసుకోవాలి |