బెండీ కబాబ్ రెసిపి
కావలసిన పదార్థాలు:
బెండకాయలు - పావ్ కేజీ
తెల్ల మిరియాల పొడి - ఒక స్పూన్.
కార్న్‌ఫ్లోర్ - సరిపడగా'.
నూనె - తగినంత
ఉప్పు - తగినంత
చీజ్ - కావలసినంత.
ఆలుగడ్డలు - 200 గ్రాములు.
పచ్చిమిరపకాయలు - నాలుగు.
బ్రెడ్‌క్రోమ్స్ - 4
ఇలాయిచి పౌడర్ - ఒక స్పూన్.
తయారుచేయు విధానం:
ముందుగా బెండకాయలనుకడిగి కట్ చేసుకుని స్టవ్ వెలిగించి గిన్నె పెట్టి ఆయిల్ వేసి అందులో బెండకాయ ముక్కలు వేసి వేయించి పక్కన పెట్టుకోవాలి.
ఆలును ఉడికించి, మెత్తగా చేసుకోవాలి. పచ్చిమిరపకాయలను పేస్ట్ చేయాలి.
ఉడికించిన ఆలును ఒక గిన్నెలో వేసి, దాంట్లో బ్రెడ్ క్రోమ్స్, కార్న్‌ఫ్లోర్, చీజ్,ఉప్పు, ఇలాయిచి పౌడర్, పచ్చిమిరపకాయల పేస్ట్ మిరియాలపొడి,అన్నీ బాగా కలపాలి.
దాంట్లో వేయించుకున్న బెండకాయ ముక్కలను కూడా వేసి బాగా కలపాలి . ఇప్పుడు కలిపిన మిశ్రమాన్ని తీసుకుని చిన్న ఉండలుగా చేసి వాటిని ఒత్తి స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి వాటిని కాల్చుకోవాలి
|