కాకరకాయ మసాలా రెసిపి
కావలసిన పదార్ధాలు:
కాకరకాయలు : పావ్ కేజీ
ఉల్లిపాయలు : రెండు పెద్దవి
కారం : రెండు స్పూన్లు
ధనియాలపొడి : ఒక స్పూను
జీలకర్ర : ఒక స్పూను
పసుపు : ఒక టీ స్పూను
ఉప్పు : సరిపడా
నూనె : తగినంత
తయారు చేసే విధానం:
ముందుగా కాకరకాయల పై పొరను తీసేయ్యాలి .
కాకరకాయ ల మధ్యలో పొడవుగా గాటు పెట్టి, లోపలి గింజలను తీసేయ్యాలి.
తరువాత వీటికి పసుపు,ఉప్పు పట్టించి.. ఓ గంట పాటు ఊర బెట్టాలి. ఉల్లిపాయలను ముక్కలుగా కోసి.. కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, కాస్తంత ఉప్పు వేసి బాగా కలపాలి.
ఈ మిశ్ర మాన్ని కాకరకాయల మధ్యలో కూరి బాగా కాగుతున్న నూనెలో వేసి డీప్ ఫ్రై చేసి తీసేయాలి.
చాలా సింపుల్ అండ్ టేస్టీ కర్రీ రెడీ
|