పైనాపిల్ మిల్క్ షేక్!
కావలసిన పదార్థాలు:
పైనాపిల్: 1
పాలు: 2cups
పంచదార: 1/2cup
వెన్నీల ఐస్ క్రీం: 1tbsp
ఐస్ క్యూబ్స్: 2
యాలకుల పొడి: 1tsp
తయారు చేయు విధానం:
1. పైనాపిల్ పై తొక్కును తీసివేసి చిన్న ముక్కలుగా కోసి మిక్సీలో వేసి జ్యూస్ తీసుకోవాలి.
2. తర్వాత రెండు కప్పుల పైనాపిల్ రసానికి, రెండు కప్పుల పాలు, చక్కెర కలిపి మళ్లీ మిక్సీలో వేయాలి.
3. దానిని ఓ గ్లాస్ లో పోసి అందులో వెన్నీల ఐస్ క్రీం, ఐస్ క్యూబ్స్ యాలకుల పొడిని కలిపి కంచెం సేపు ఫ్రిజ్ లో పెట్టి బాగా చల్లగా అయిన తర్వాత తాగితే వేసవి దాహం చక్కగా తీరుతుంది. |