బాసుందీ పాయసం
కావలసిన పదార్థాలు:
* పాలు : ఒక లీటరు (ఫుల్ క్రీమ్)
* పంచదార : 3/4 కప్పు
* బాదామ్ పేస్ట్ : పావు కప్పు
* యాలకుల పొడి : అర టీ స్పూన్
తయారుచేసే విధానం:
* పాలను బాగా మరిగి సగం అయ్యే వరకు కలియబెడుతూ ఉండండి.
* తర్వాత చక్కెరను, బాదాం పేస్ట్‌ను పాలలో వేసి కలగలపండి.
* పంచదార కరిగిన తర్వాత పొయ్యి నుంచి మరిగిన పాలను దించండి.
* ఈ మిశ్రమాన్ని 15 నిమిషాల పాటు ఫ్రిజ్‌లో ఉంచండి. తర్వాత బాదాంను సన్నగా తరగి వడ్డించండి.
|