టేస్టీ చికెన్
కావలసినవి:
బోన్‌లెస్ చికెన్ - అర కేజి
చింతకాయలు(లేతవి) - వంద గ్రాములు
ఉల్లిపాయలు - వంద గ్రాములు
నూనె - యాభై గ్రాములు
అల్లం వెల్లుల్లి పేస్ట్ - ఒక టేబుల్ స్పూన్
కొబ్బరి పొడి - ఒక టేబుల్ స్పూన్
కారంపొడి - ఒక టేబుల్ స్పూన్
పసుపు - చిటికెడు
లవంగాలు, యాలకుల పొడి - చిటికెడు
పచ్చిమిరప కాయలు - నాలుగు
ఉప్పు - తగినంత
కొత్తిమీర - తగినంత
తయారు చేయు విధానం:
ముందుగా చింతకాయలు, ఉల్లిపాయలను మెత్తని పేస్ట్‌లా చేసి ఈ మిశ్రమాన్ని చికెన్ ముక్కల్లో వేసి బాగా కలిపి పది నిమిషాలు నానబెట్టాలి.
స్టవ్‌పై బాణలి ఉంచి అందులో కొద్దిగా నూనె వేసి అది వేడెక్కాక పచ్చిమిరప కాయలు, అల్లంవెల్లుల్లి పేస్ట్ వేసి వేగించాలి.
తర్వాత చికెన్ ముక్కలను అందులో వేసి, చిటికెడు పసుపు చేర్చి గరిటెతో కలుపుతూ కొద్దిసేపు వేగించాలి.
తర్వాత కారంపొడి, ఉప్పు, కొబ్బరిపొడి, లవంగాలు, యాలకుల పొడి వేసి కలపాలి. చివరగా కొత్తిమీర చల్లి దించేయాలి.
|