బనానా బర్ఫీ
Author : teluguone
Preparation Time : 20m
Cooking Time : 15m
Yield : 4
4.0 Stars based on 291 : Reviews
Published On : January 6, 2024
Recipe Category : Sweets N Deserts
Recipe Type : Starter
Total Time : 35m
Ingredient : Banana Burfi
Description:

Banana Burfi 

Recipe of బనానా బర్ఫీ

Banana Burfi 

Directions | How to make  బనానా బర్ఫీ

బనానా బర్ఫీ!

కావాల్సిన పదార్థాలు:

అరటి పండ్లు - 3 ( ముక్కలుగా కట్ చేసుకుని మిక్సీ పట్టుకోవాలి)

కొబ్బరికోరు - ఒకటిన్నర కప్పు

నెయ్యి- 3 టేబుల్ స్పూన్స్

మిల్క్ పౌడర్ - 1కప్పు

బెల్లం తురుము - ముప్పావు కప్పు

ఏలకుల పొడి- హాఫ్ టీస్పూన్

చిక్కటి పాలు - పావు కప్పు (మరిగించినవి)

బాదం- గార్నిష్ కోసం

తయారీ విధానం:

ఒక బౌల్ లో కొబ్బరి కోరు, బెల్లం తురుము, పాలు పొసి...సిమ్ ఫ్లేమ్ లో స్టవ్ మీద పెట్టి గరిటెతో కలుపుతుండాలి.

కొంచెం దగ్గర పడుతున్న సమయంలో అందులో నెయ్యి, అరటిపండు గుజ్జు, మిల్క్ పౌడర్, ఏలకుల పొడి వేసి కలపాలి.

ఈ మిశ్రమం దగ్గర పడగానే ఒక పాత్రలోకి తీసుకుని జీడిపప్పు, బాదం ముక్కలతో గార్నిష్ చేసి 3 లేదా 4 గంటలు ఫ్రిజ్ లో పెట్టాలి.

తర్వాత కావాల్సిన ఆకారంలో ముక్కలుగా కట్ చేసుకుని సర్వ్ చేసుకోవాలి.