తాటి బెల్లం కాఫీ
కావాల్సిన పదార్థాలు:
నీళ్లు - 1 కప్పు
తాటిబెల్లం - రుచికి తగినంత
ఫ్యాట్ మిల్క్ - పావు లీటర్
కాఫీ పౌడర్ - కావాల్సినంత
తయారీ విధానం:
తాటి బెల్లాన్ని ముక్కలుగా కట్ చేసుకోవాలి.
తర్వాత ఒక గిన్నెలో నీళ్లు పోసి అందులో తాటి బెల్లాన్ని వేసి వేడిచేసుకోవాలి.
తాటి బెల్లం కరుగుతుండగానే..మరో గిన్నెలో పాలు పోసి వేడి చేసుకోవాలి.
పాలు మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కొద్దిగా చల్లారనివ్వాలి.
తాటి బెల్లి కరిగిన తర్వాత కాఫీ పౌడర్ వేసి కలుపుకోవాలి. దీన్ని మరిగించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.
డికాషన్ కొద్దిగా చల్లారిన తర్వాత ఒక గ్లాస్ పావు వంత డికాషన్ తీసుకోవాలి.
తర్వాత పాలు పోసి కలిపి వేడి వేడిగా సర్వ్ చేసుకోవాలి. ఇలా చేస్తే తాటిబెల్లం కాఫీ సిద్ధమవుతుంది.
అయితే ఈ కాఫీ తయారు చేసేటప్పుడు డికాషన్, పాలు మరీ వేడిగా లేకుండా చేసుకోవాలి.
తాటిబెల్లంతో కాఫీని తయారు చేసుకోవడం వల్ల రుచితోపాటు ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిది. |