ఎగ్ షేర్వా
కావాల్సిన పదార్ధాలు:
కోడిగుడ్లు - 4 ఉడికించినవి
టమాటా ముక్కలు - అర కప్పు
నూనె - 3 టేబుల్ స్పూన్
బిర్యానీ ఆకు - 1
అల్లం వెల్లుల్లి పేస్టు - 1 టీస్పూన్
కరివేపాకు - 1 రెమ్మ
పసుపు - పావు టీస్పూన్
కారం - 2 టీస్పూన్స్
ధనియాల పొడి - 1 టీస్పూన్
ఉప్పు -రుచికి సరిపడా
నీళ్లు - ఒకటిన్నర కప్పు లేదా రెండు గ్లాసులు
కొత్తిమిర- కొద్దిగా
పుదీనా - కొద్దిగా
కసూరిమెంతి - అర టీస్పూన్
ఉల్లిపాయ ముక్కలు
సోంపు గింజలు
పచ్చిమిర్చి
మసాల పేస్ట్ కు కావాల్సిన పదార్ధాలు:
ఎండుకొబ్బరి ముక్కలు - 2 టేబుల్ స్పూన్స్
జీడిపప్పు - 8
దాల్చిన చెక్క - 1
ఇంచు యాలకులు - 3
లవంగాలు -4
కొత్తిమీర - 2 టేబుల్ స్పూన్స్
తయారీ విధానం:
జార్ లో ఎండు కొబ్బరి ముక్కలతోపాటు మిగిలిన మసాలా పదార్థాలు వేసి మెత్తగా మిక్సి పట్టుకోవాలి.
తర్వాత అదే జార్ లో టమాట ముక్కలు వేసి మెత్తగా గ్రైండ్ చేయాలి.
తర్వాత కళాయిలో నూనె వేసి వేడి చేసి...అందులో బిర్యానీ ఆకు,
సోంపు గింజలు వేసి వేయించుకోవాలి. తర్వాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసి వేయించుకోవాలి.
వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు కరివేపాకు వేసి వేయించాలి.
తర్వాత మిక్కీ పట్టుకున్న టమాట పేస్టు వేసి వేయించాలి.
సగం వేగిన తర్వాత మిక్సీ పట్టుకున్న పేస్టు వేయాలి.
తర్వాత ఉప్పు కారం, పసుపు వేసి నూనె పైకి తేలే వరకు వేయించాలి.
తర్వాత నీళ్లు కొత్తిమీర , పుదీన వేసి కలపాలి.
నీళ్లు మరిగి పొంగు వచ్చిన తర్వాత ఉడికించిన గుడ్లకు గాట్లు పెట్టి వేయాలి.
తర్వాత దీనిపై మూత పెట్టి సిమ్ లో కలుపుతూ 8 నిమిషాలు ఉడికించాలి.
ఇలా ఉడికిన తర్వాత కొద్దిగా కొత్తిమిర, కసూరి మెంతి వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేస్తే ఎగ్ షేర్వా రెడీ అవుతుంది. |