ఉసిరికాయ తొక్కు
కావాల్సిన పదార్థాలు:
ఉసిరికాయలు - 10 నుంచి 12
నూనె - 1 టేబుల్ స్పూన్
ఉప్పు -తగినంత
పసుపు - అర టీ స్పూన్
మెంతులు - అర టీ స్పూన్
మినపపప్పు -2 టీ స్పూన్స్
ఎండుమిర్చి - 10
కరివేపాకు - 2 రెమ్మలు
వెల్లుల్లి రెబ్బలు - 7
నిమ్మరసం - అర చెక్క
తాళింపు కోసం:
నూనె - 3 టేబుల్ స్పూన్స్
ఆవాలు - 1 టీ స్పూన్
జీలకర్ర - అర టీ స్పూన్
ఎండుమిర్చి - 1
వెల్లుల్లి రెబ్బలు - 4
కరివేపాకు - 1 ఒక రెమ్మ
ఇంగువ - కొద్దిగా
తయారీ విధానం:
ముందు ఉసిరికాయలను కడిగి తడిలేకుండా తుడుచుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత వాటిని ముక్కలుగా కట్ చేసి లోపలి గింజలు తీయాలి. తర్వాత కడాయిలో నూనె పోసి వేడి చేయాలి. అందులో ఉసిరికాయ ముక్కలు, ఉప్పు, పసుపు వేయాలి. ఉసిరికాయ ముక్కలు మగ్గిన తర్వాత వాటిని వేరే ప్లేటులోకి తీసుకోవాలి. అదే కడాయిలో మరో టేబుల్ స్పూన్ నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడెయ్యాక మెంతులు, మినప పప్పు, ఎండుమిర్చి, కరివేపాకు వేసి వేయించాలి. తర్వాత వీటిని ఒక జార్ లోకి తీసుకుని అందులో వెల్లుల్లి రెబ్బలు, ఉసిరికాయ ముక్కలు, నిమ్మరసం వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత కడాయిలో తాళింపునకు నూనెవేసి వేడి చేయాలి. నూనెలో తాళింపు పదార్థాలు వేయాలి.
తర్వాత గ్రైండ్ చేసుకున్న పచ్చడి వేసి కలపాలి. రెండు నిమిషాల పాటు వేయించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేస్తే ఎంతో రుచికరమైన ఉసిరికాయ పచ్చడి రెడీ. |