Custard barfi
Diwali Special
కావలసిన పదార్దాలు:
కస్టర్డ్ పౌడర్ - 1 కప్పు
పంచదార - 1 కప్పు
ఫ్రూట్ ఎసెన్స్ - 1/2 కప్పు
వాటర్ - 1/2 to 2 కప్పులు
నెయ్యి - 3 to 4 స్పూన్స్
నిమ్మచెక్క - 1 పిస్తాపప్పు
తయారీ విధానం:
ముందుగా బాణలిలో రెండు స్పూన్ల నేతిలో పిస్తాపప్పు వేయించి తీసి అందులో ఎసెన్స్ వేసి కలిపి పక్కన ఉంచుకోవాలి. మరికొద్ది నేతిలో పంచదార వేసి మునిగేలా నీరు పోసి స్టవ్ సిమ్ లో ఉంచుకోవాలి. ఇప్పుడు కస్టర్ట్ పౌడర్లో (Custurd powder) 1 కప్పు పూర్తి నీరు పోసి కరిగించుకొని చెక్కర కరిగాక అందులో.. నీటిలో కలుపుకున్న కస్టర్డ్ పౌడర్ ను పోస్తూ కలపాలి. కలిపే కొద్ది 5 నుండి 10 నిమిషాలలోపు పాదరస మెరుపులో బర్ఫీ ముద్ద దగ్గర పడుతుంది. ప్రక్కన నేయి రాసిన ట్రే రెడీగా ఉంచుకొని చక్కగా దగ్గర పడిన ముద్దను ప్లేట్లో పరుచుకోవాలి. ఒక 20 నిమిషాలు చల్లారనిచ్చి.. నిమ్మరసం, పిస్తాపప్పు దానిపై వేసి ముక్కలు గా కత్తిరించుకోవాలి. చాలా రుచిగా నోట్లో వేస్తే కరిగిపోయే బర్ఫీ రెడీ. |