రవ్వ కేసరి రెసిపీ
కావాల్సిన పదార్థాలు:
రవ్వ-200గ్రాములు
పంచదార-1కప్పు
జీడిపప్పు-200గ్రాములు
సాఫ్రాన్-2 చిటికెడు
లవంగాలు-200గ్రాములు
నెయ్యి-20గ్రాములు
ఎండు ద్రాక్ష- 75గ్రాములు
పైనాపిల్ నల్లయాలకులు-3
మంచినీరు-ఒకటిన్నర కప్పు
తయారీ విధానం:
మందపాటి ప్యాన్ తీసుకుని..దానిని మీడియం మంటపై పెట్టి దాంట్లో నెయ్యి వేయాలి. నెయ్యిలో జీడిపప్పు, లవంగాలు వేసి వేయించాలి. ఆ తర్వాత అందులో రవ్వ వేసి వేయించాలి. వేయించిన రవ్వలో నీరు, పంచదార, పైనాపిల్ ముక్కలు, యాలకుల పొడి, ఎండుద్రాక్ష వేసి కలపాలి. దాంట్లోనే సాఫ్రాన్ కూడా వేయాలి. అది ఎరుపు రంగులోకి వస్తుంది. అంతే గుమగుమలాడే రవ్వ కేసరి సిద్ధం. దీనికొద్ది నీళ్లు తగ్గించి పాలు కూడా పోయవచ్చు. అలా చేసిన ఎంతో రుచిగా ఉంటుంది. |