బతుకమ్మ స్పెషల్ మలీద లడ్డు..!!
:
కావాల్సిన పదార్థాలు:
గోధుమ పిండి- 1 కప్పు
బెల్లం లేదా చక్కెర - పావు కప్పు
జీడిపప్పు, కిస్మిస్, ఏలకుల పొడి
పాలు - 1 టేబుల్ స్పూన్
నెయ్యి- 1 టేబుల్ స్పూన్
నీళ్లు-పిండి తడిపేందుకు కావాల్సిననన్ని
తయారీ విధానం:
ముందుగా పిండిని మెత్తగా కలుపుకోవాలి. చిన్న చిన్న ఉండలుగా చేసుకుని చపాతీల్లా వత్తుకోవాలి. వీటినిపేనం మీద రెండు వైపులా కాల్చాలి. సన్నని మంట మీద కాల్చుతే..మాడిపోకుండా ఉంటాయి. ఇప్పుడు ఒక పాత్రలో బెల్లం, జీడిపప్పు, కిస్మిస్, ఏలకుల పొడి వేసి నెయ్యి వేయాలి. వీటిని బాగా కలపాలి. ఇప్పుడు కాల్చిన చపాతీలను చిన్న చిన్న ముక్కలుగా చేసుకుంటూ అందులో వేయాలి. కొన్ని పాలు పోయాలి. వేడి వేడిగా ఉన్నప్పుడే చిన్న చిన్న లడ్డుల్లా చేసుకోవాలి. అంతే సింపుల్ మలీద లడ్డు రెడీ. ఈ లడ్డును తెలంగాణలో సద్ధుల బతుకమ్మ రోజు నైవేద్యంగా సమర్పిస్తారు. |