ఫ్రూట్ కస్టర్డ్
Author : TeluguOne
Preparation Time : 10m
Cooking Time : 15m
Yield : 4
4.0 Stars based on 291 : Reviews
Published On : April 22, 2024
Recipe Category : Beverages
Recipe Type : Solo Dish
Total Time : 25m
Ingredient : Fruit Custard
Description:

Fruit Custard

Recipe of ఫ్రూట్ కస్టర్డ్

Fruit Custard

Directions | How to make  ఫ్రూట్ కస్టర్డ్

 

ఫ్రూట్ కస్టర్డ్

 

కావాల్సిన పదార్ధాలు:

పాలు - ఒక లీటర్

వెనీలా ఫ్లేవర్ కస్టర్డ్ పౌడర్ - నాలుగు టేబుల్ స్పూన్స్

పంచదార - అర కప్పు

మిక్స్డ్ ఫ్రూట్ ఎసెన్స్ - పావు టీ స్పూన్

అరటిపండు - ఒకటి

ఆపిల్ - ఒకటి

సపోటా - ఒకటి

కివీ - ఒకటి

ఖర్జూరం - 7

జీడిపప్పు - 50 గ్రా

నల్ల ద్రాక్ష - 50 గ్రా

గ్రీన్ ద్రాక్ష - 50 గ్రా

ఖర్భూజ ముక్కలు - అర కప్పు

దానిమ్మ గింజలు - అర కప్పు

తయారీ విధానం:

* పావు లీటర్ పాలల్లో కస్టర్డ్ పౌడర్, ఎసెన్స్ వేసి గడ్డలు లేకుండా కలుపుకోవాలి.

* పాలని ఒక పొంగు రానిచ్చి అందులో పంచదార, ఇంకా కస్టర్డ్ మిల్క్ వేసి గడ్డలు లేకుండా చిక్కబడేవరకు కలపాలి.

* తర్వాత ఫ్రిజ్లో 2 గంటలు ఉంచాలి.

* 2 గంటల తరువాత కస్టర్డ్ గట్టిగా మీగడ పెరుగులా అవుతుంది, అప్పడు మిక్సీలో వేసి గ్రైండ్ చేస్తే కస్టర్డ్ క్రీమీగా అవుతుంది.

* ఫ్రిజ్లో గంట ముందే ఫ్రూట్స్ ని ముక్కలుగా కట్ చేసి ఉంచుకోవాలి.

* ఒక గ్లాస్ లో కస్టర్డ్ పోసి దాని మీద ఫ్రూట్స్ కొద్దిగా ఒక లేయర్ గా వేసి దాని మీద కస్టర్డ్ పోసుకోవాలి.

* కస్టర్డ్ మీద మళ్ళీ ఒక లేయర్ గా ఫ్రూట్స్ వేసుకుంటూ ఇలా గ్లాస్ జార్ నింపాలి.

* నింపిన జార్ని మళ్ళీ ఒక గంట ఫ్రిజ్లో ఉంచి తింటే చాలా బాగుంటుంది, లేదా వెంటనే కూడా తినవచ్చు.