సొరకాయ పప్పు
కావాల్సిన పదార్ధాలు:
సొరకాయ ముక్కలు - మూడు కప్పులు
టమాటో ముక్కలు - ఒక కప్పు
ఉల్లిపాయ తరుగు - అర కప్పు
నానబెట్టిన కంది పప్పు - ముప్పావు కప్పు
పసుపు - పావు టేబుల్ స్పూన్
పచ్చిమిర్చి చీలికలు - రెండు
నీళ్లు - మూడు కప్పులు
ఉప్పు - తగినంత
నిమ్మరసం - ఒక టేబుల్ స్పూన్
కొత్తిమీర తరుగు - పావు కప్పు
తాలింపు కోసం:
నూనె - రెండు టేబుల్ స్పూన్స్
ఆవాలు - ఒక టేబుల్ స్పూన్
జీలకర్ర - ఒక టేబుల్ స్పూన్
ఇంగువ - చిటికెడు
చల్ల మిరపకాయలు - రెండు
కరివేపాకు - రెండు రెబ్బలు
దంచిన వెల్లులి - రెండు రెబ్బలు
తయారీ విధానం:
* కుక్కర్లో ఉప్పు నిమ్మరసం కొత్తిమీర తరుగు తప్ప మిగిలిన పదార్దాలు అన్నీ వేసి మూడు విజిల్స్ వచ్చే దాకా మెత్తగా ఉడికించుకోవాలి. * ఉడికిన పప్పుని మెత్తగా మెదుపుకోవాలి. * నూనె వేసి తాలింపు పదార్దాలు అన్నీవేసి ఎర్రగా వేపి పప్పులో కలుపుకోవాలి. * తాలింపు కలుపుకున్న పప్పులో ఉప్పు నిమ్మరసం కొత్తిమీర తరుగు వేసి కలిపి దింపేసుకోవాలి. |