Tomato Karivepaku Pachadi
Author : TeluguOne
Preparation Time : 10m
Cooking Time : 15m
Yield : 4
4.0 Stars based on 291 : Reviews
Published On : August 4, 2023
Recipe Category : Pickles
Recipe Type : Solo Dish
Total Time : 25m
Ingredient : Tomato Karivepaku Pachadi
Description:

Tomato Karivepaku Pachadi

Recipe of Tomato Karivepaku Pachadi

Tomato Karivepaku Pachadi

Directions | How to make  Tomato Karivepaku Pachadi

 

టమాటో కరివేపాకు పచ్చడి

 

కావాల్సిన పదార్ధాలు:

టమాటో - 300 gms

కరివేపాకు - ఒక కప్పు

కొత్తిమీర - పావు కప్పు

నువ్వులు - ఒక టేబుల్ స్పూన్

పచ్చి కొబ్బరి తురుము - అర కప్పు

పచ్చిమిర్చి - ఆరు

నూనె - మూడు టేబుల్ స్పూన్స్

తాలింపు కోసం:

ఆవాలు - అర టేబుల్ స్పూన్

జీలకర్ర - అర టేబుల్ స్పూన్

మినపప్పు - అర టేబుల్ స్పూన్

పచ్చిశెనగపప్పు - ఒక టేబుల్ స్పూన్

ఎండుమిర్చి - రెండు

తయారీ విధానం:

* కళాయిలో నూనె వేడి చేసి అందులో నువ్వులు వేసి వేగనివ్వాలి. తరువాత కొబ్బరి తురుము, పచ్చిమిర్చి వేసి బాగా వేపుకోవాలి.

* వేగిన పచ్చిమిర్చిలో కరివేపాకు వేసి కొంచెంసేపు వేపుకోవాలి.

* తరువాత అన్నీ మిక్సీలోకి తీసుకొని కొత్తిమీరతో సహా కొద్దిగా నీళ్లు వేసి మెత్తని పేస్ట్ చేసుకోవాలి.

* వేరే కళాయిలో నూనె వేడి చేసి అందులో టమాటో ముక్కలు ఉప్పు వేసి మెత్తగా మగ్గనివాలి. మగ్గిన టమాటలో గ్రైండ్ చేసుకున్న కరివేపాకు మిక్సీలో 2 లేదా 3 సార్లు కలుపుకోవాలి.

* తాలింపు కోసం మిగిలిన నూనె వేడి చేసి అందులో తాలింపు దినుసులు వేసి అవి ఎర్రగా వేగాక పచ్చడిలో కలుపుకోవాలి.