Many kinds of pickles are made during the summer season. One such special kind of Andhra Pickle is called as Magaya Pachadi which is made of dried mango.
Recipe of Magaya Avakaya
Magaya Avakaya
Directions | How to make  Magaya Avakaya
మరువలేని మాగాయ..
అమ్మ ఆవకాయ అంజలి అస్సలు బోరు కొట్టవు అని ఎదో సినిమాలో అన్నట్టు నిజంగా ఆవకాయ అస్సలు బోర్ కొట్టదు. ఆవకాయ రుచి ని ఆస్వాదించడానికి ఆంధ్ర , తెలంగాణ అనే తారతమ్యాలు ఉండవు , చిన్న పెద్ద అనే బేధం అస్సలే ఉండదు , పేదవాడికి , ధనికుడికి అందరికి బంధువు ఈ ఆవకాయ... వేసవి కాలం వచ్చిందంటే చాలు అందరూ పచ్చళ్ళు పెట్టె బిజీ లో ఉంటారు , కానీ రుచి గా, సంవత్సరం వరకు నిల్వ ఉండే పచ్చడి పెట్టడం అందరికి సాధ్యం అవదు , కానీ కిలోల కొలతలతో కాకుండా ఇపుడు మేము చెప్పే ఈ సులభమైన పద్దతిలో చేసి చూడండి.ఆవకాయ అనగానే బెల్లం ఆవకాయ ,పెసర ఆవకాయ ఇలా చాల నేర్చుకున్నాం ,ఇపుడు అందరూ ఇష్టపడే మాగాయ గురించి తెల్సుకుందాం ,చాల కమ్మగా ఎంతో రుచికరంగా ఉండే మాగాయ ఎలా చేసుకోవాలో చూద్దాం..
మాగాయ పెట్టడానికి కావాల్సినవి :
ముందుగా మామిడికాయలు తీస్కుని వాటిని శుభ్రంగా కడిగి వాటి చెక్కు తీసి సన్నగా తరిగి పెట్టుకోవాలి
మామిడి ముక్కలు
కారం
ఉప్పు (దొడ్డు ఉప్పు )
ఆవాలు
మిరపకాయలు
పసుపు తగినంత
నువ్వుల నూనె ముక్కలు మునిగేంత
తయారు చేసే విధానం :
ముందుగా మనం కొలత కోసం ఎదో ఒక కప్ తీస్కుని, దానితో 3 కప్పుల మామిడి ముక్కలు తీసుకుందాం, ఒకవేళ 50 కాయలు తీసుకుంటే ఒక కిలో ఉప్పు తీసుకోవాలి. మామిడికాయ ముక్కల్లో ఉప్పు వేసి బాగా కలిపి మూడురోజుల పాటు అలానే ఉంచాలి. ఆ తరువాత ఉప్పు అంత ఊట లాగా మారిపోతుంది. అప్పుడు ముక్కల్ని ఊటని వేరు చేసి ఎండలో పెట్టాలి,కానీ మరీ ఎక్కువ ఎండపెట్టకూడదు. ఆ తర్వాత 1 /2 కప్పు నూనె తీసుకోవాలి. స్టవ్ పైన ఒక పాన్ పెట్టి నూనె వేసి ఆవాలు ఎండుమిర్చి, కావాలంటే పచ్చి సెనగపప్పు కూడా వేసుకోవచ్చు,కావాలంటే మెంతిపిండి కూడా వేసుకోవచ్చు.. ఆ తాలింపు లోనే అర కప్పు కారం కూడా వేసి బాగా కలిపి చల్లారాక అందులో మనం ఊరబెట్టుకున్న మామిడి ముక్కలు వేసుకోవాలి ,ఇంకొంచెం నూనే కూడా వేసుకోవాలి. అంతే చక్కటి సువాసనతో మాగాయ రెడీ. ముక్కలు మునిగేంత నూనె పోసుకుని బాగా కలుపుకుని జాడీలో భద్రంగా పెట్టుకుంటే సంవత్సరం వరకు ఈ ఆవకాయ పాడవకుండా నిలవ ఉంటుంది. మరింకెందుకాలస్యం మీరు కూడా నోరూరించే మాగాయ మహాద్భుతం అన్నారుగా ,పెట్టేసుకోండి మరి...