Summers are special of pickles & one of its kind pickle is the Pesara Avakaya or Moong Dal Pickle...
Recipe of Pesara Avakaya
Pesara Avakaya
Directions | How to make  Pesara Avakaya
ఈ విధంగా పెడితే పెసర ఆవకాయ ఎప్పటికి పాడవదు..
అమ్మ ఆవకాయ అంజలి అస్సలు బోరు కొట్టవు అని ఎదో సినిమాలో అన్నట్టు నిజంగా ఆవకాయ అస్సలు బోర్ కొట్టదు. ఆవకాయ రుచి ని ఆస్వాదించడానికి ఆంధ్ర , తెలంగాణ అనే తారతమ్యాలు ఉండవు , చిన్న పెద్ద అనే బేధం అస్సలే ఉండదు , పేదవాడికి , ధనికుడికి అందరికి బంధువు ఈ ఆవకాయ వేసవి కాలం వచ్చిందంటే చాలు అందరూ పచ్చళ్ళు పెట్టె బిజీ లో ఉంటారు , కానీ రుచి గా, సంవత్సరం వరకు నిల్వ ఉండే పచ్చడి పెట్టడం అందరికి సాధ్యం అవదు , కానీ కిలోల కొలతలతో కాకుండా ఇపుడు మేము చెప్పే ఈ సులభమైన పద్దతిలో చేసి చూడండి.
పెసర ఆవకాయ పెట్టడానికి కావాల్సినవి :
ముందుగా మామిడికాయలు తీస్కుని వాటిని శుభ్రంగా కడిగి వాటి ముచుకను తీసి ఒక అరగంటా పాటు నీళ్ళల్లో ఉంచి ఆ తర్వాత వాటిని శుభ్రంగా తుడిచి మనకు కావాల్సిన సైజు లో ముక్కలు కోసి పెట్టుకోవాలి.
మామిడి ముక్కలు - 6కప్పులు
కారం - ఒక కప్పు
పెసర పిండి - ఒక కప్పు
ఆవ పిండి - ఒక టేబుల్ స్పూన్
పసుపు - తగినంత
నువ్వుల నూనె - ముక్కలు మునిగేంత
ఉప్పు (దొడ్డు ఉప్పు) - 3/4 వంతు కప్పు
తయారు చేసే విధానం :
ముందుగా మనం కొలత కోసం ఎదో ఒక కప్ తీస్కుని దానితో ఆరు కప్పుల మామిడి ముక్కలు తీసుకుందాం. ముక్కలు మునిగేంత నూనె తీస్కుని ఆ నూనెలో మామిడి కాయ ముక్కల్ని వేసి ముక్కలకి నూనె పట్టించి వేరే ప్లేట్ లోకి తీసేసుకోవాలి. ఇపుడా నూనె లో ఒక కప్పు కారం వేయాలి.. ఇంకా ఒక టేబుల్ స్పూన్ ఆవపిండి కూడా వేయాలి. ఉప్పు కూడా ఒక కప్పు కంటే కొంచెం తగ్గించి వేసుకోవాలి , ఒకవేళ కావాలంటే మళ్ళీ కలుపుకోవచ్చు పసుపు అర చెంచా వేస్కోవాలి' పెసర పిండి ఒక కప్పు వేసుకోవాలి.
వీటన్నిటిని బాగా కలుపుకోవాలి.. చివరిగా మామిడికాయ ముక్కల్ని కూడా వేసి అన్ని బాగా కలపాలి, ఒకవేళ ఇలా కలుపుకున్నాక బాగా పల్చగా అనిపిస్తే మరో కప్పు పెసరపిండి కలుపుకోవచ్చు.ఇలా కలిపిన ముక్కల్ని మూడు రోజుల పాటు ఉంచి , మూడవ రోజున ఉప్పు చూసుకుని ,ముక్కలు మునిగేంత నూనె పోసుకుని జాడీలో భద్రంగా పెట్టుకుంటే సంవత్సరం వరకు చక్కగా ఆవకాయ పాడవకుండా ఉంటుంది.. ఇదండీ ఈజీ గా అందరూ పెట్టగలిగే పెసర ఆవకాయ , ఆలస్యం చేయకుండా ఎవరిపై ఆధారపడకుండా ఆవకాయ పెట్టేయండి మరి..