కలర్ ఫుల్ వెజిటబుల్ సలాడ్ ( Holi Special )
సమ్మర్ లో రైస్ ఐటమ్స్ ఎక్కువగా తినాలనిపించదు. అలా అని తినక పొతే నీరసం వస్తుంది. అందుకే ఎలాంటి హెల్త్ ప్రొబ్లెమ్స్ రాకుండా ఉండాలంటే వీలయినన్ని పచ్చి కూరగాయలు ఆహారంలో భాగంగా తీసుకుంటే ఆరోగ్యానికి మేలు చేస్తాయి. కీరదోస, కేరట్ టమాటో ఇలాంటి వాటితో చేసిన సలాడ్స్ ఈ వేసవి తాపాన్నితగ్గించి ఒంటిలో లిక్విడ్ లెవెల్స్ పడిపోకుండా మనని కాపాడతాయి.
కావలసిన పదార్థాలు:
కీరదోసకాయ ముక్కలు - 1/2 కప్పు
క్యారెట్ ముక్కలు - 1/2 కప్పు
బీట్రూట్ - 1/4 కప్పు
క్యాబేజీ ముక్కలు - 1/4 కప్పు
టమోటో ముక్కలు - 1/2 కప్పు
ఉల్లిపాయ ముక్కలు - 1/2 కప్పు
కొత్తిమీర - 2 స్పూన్స్
పచ్చిమిర్చి - 4 లేదా 6
వెనిగర్ - 1 స్పూన్
నిమ్మరసం - 2 స్పూన్స్
ఉప్పు- రుచికి తగినంత
తయారు చేయు విధానం:
ఈ సలాడ్ తయారుచేయటానికి ముందుగా కూరగాయలన్నిటిని సన్నగా పొడుగ్గా తరిగి పెట్టుకోవాలి. మొదటగా కొత్తిమీర, పచ్చిమిర్చి కలిపి మెత్తగా గ్రైండ్ చేయాలి. ఒక బౌల్ తీసుకొని అందులో అన్నిరకాలు కూరగాయ ముక్కులు వేసి, ఉప్పు వేసి బాగా కలపాలి. తర్వాత పచ్చిమిర్చి, కొత్తిమీర ముద్దను వేసి ముక్కలకు బాగా పట్టేలా మరొకసారి కలపాలి. చివరగా వెనిగర్, నిమ్మరసం వేసి కలిపి సర్వ్ చేయాలి. పైన కూడా కాస్త కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేస్తే చాలా బాగుంటుంది.
- కళ్యాణి
|