కొర్ర బ్రెడ్!
కావలసిన పదార్ధాలు:
కొబ్బరి పాలు – అర కప్పు
బెల్లం పొడి – 2 టీ స్పూన్లు
కొర్ర పిండి – ఒక కప్పు
నీళ్లు – అర కప్పు
ఉప్పు – తగినంత
ఈస్ట్ – అర టీ స్పూను
గోధుమ పిండి – ఒకటిన్నర కప్పులు
బ్రెడ్ ఇంప్రూవర్ – 0. 05 గ్రా
తయారు చేసే విధానం :
స్టౌ మీద బాణలిలో నీళ్లు పోసి వేడి చేయాలి. గోరు వెచ్చగా ఉండగానే అందులో ఈస్ట్, బెల్లం పొడి, ఉప్పు వేసి కలిపి దింపేయాలి. కొబ్బరి పాలు జత చేయాలి. కొర్ర పిండి, గోధుమ పిండి, బ్రెడ్ ఇంప్రూవర్ మూడింటినీ కలుపుకుని, అప్పడాల పీట మీద వేసి బాగా కలపాలి. ఒక గిన్నెకు నూనె పూసి, ఈ తయారైన పిండి ముద్దను అందులో పెట్టి, మూత పెట్టి, రెండు గంటలపాటు నాననివ్వాలి. అప్పుడు అది పొంగుతుంది. అవెన్‌ను 180 డిగ్రీల దగ్గర వేడి చేయాలి. బన్ పాన్ తీసుకుని దానికి నూనె పూయాలి. ఈ తయారైన ముద్దను మళ్లీ పది నిమిషాల పాటు బాగా కలపాలి. ఆ తరవాత ట్రే లో ఉంచి, అవెన్‌లో పెట్టి పావు గంట సేపు బేక్ చేసి తీసేయాలి.
|