Directions | How to make  Atukula Laddu (Krishnashtami Special)
అటుకుల లడ్డు (కృష్ణాష్టమి స్పెషల్)
కావలసిన పదార్ధాలు:
అటుకులు - 1 కప్పు
పుటానా - 1 /4 కప్పు
కొబ్బరి కోరు - 1 /4 కప్పు
ఖర్జూరాలు 3, 4
గసజసలు - 2, 4 చెంచాలు
బెల్లం - 1 / 2
ఇలాచీపొడి - 1 /4 చెంచాలు
నేయి - తగినంత
తయారీ విధానం :
అటుకులు పొడి మూకుడులో వేయించుకోవాలి. అవితీసి మిక్సీ జార్ లో వేసుకోవాలి... మూకుడులో నేయి వేసి గసగసాలు, కొబ్బరి వేయించుకోవాలి.. అవీ మిక్సీ లో వేసుకుని బరకగా పట్టి, పుటానాకూడా వేసి బెల్లం, ఇలాచీ పొడి వేసి.. మరోసారి మిక్సీ లో తిప్పుకోవాలి.. అన్నీకలిపి బౌల్‌లోకి తీసుకుని ఖర్జూరం ముక్కలు వేసి వేడి నేయి వేసి బాగా కలిపి లడ్డులు చుట్టుకోవాలి. చాలా రుచిగా ఉంటాయి.