Directions | How to make  Anapakaya Telagapindi Curry
ఆనపకాయ తెలగపిండి కూర
కావలసిన పదార్ధాలు :-
ఆనపకాయ ముక్కలు - 1/4 kg
వెల్లుల్లి రేకలు - 8 to 10
తెలగపిండి - పావు కప్పు
ఎండుమిర్చి - 2
కరివేపాకు - 10 ఆకులు
ఆవాలు - 1/4 చెంచా
జీలకర్ర - 1/4 చెంచా
పసుపు - 1/4 చెంచా
ఉప్పు - 1/2 చెంచా
మినప్పప్పు -1/2 చెంచా
ఇంగువ - కొద్దిగా
నూనె - పోపుకుతగినంత
తయారీవిధానం:-
ఆనపకాయ ముక్కలు చిన్నగా తరుగుకుని నూనెలో ఎండుమిరప, వెల్లులి, కరివేపాకు, ఇంగువ మిగతా పోపుగింజలు వేసి వేయింఛుకుని ఆనపముక్కలు మీద కొద్దిగా ఉప్పు, పసుపు, వేసి పోపులో ఈ ముక్కల్ని మగ్గనివ్వాలి. మూడు వంతులపైగా ఉడికాక తెలగపిండి అచ్చుని చిన్నముక్కలుగా చేసుకొని మిక్సీలో పొడిగా ఆడాలి (లేదా) తెలగపిండి పొడి దొరికితే ఆపొడి పావుకప్పు వేసి మూతపెట్టి మగ్గ నివ్వాలి. కమ్మని వాసనతో రుచికరమైన కూర తయారవుతుంది. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. అన్నంతో చాలా బావుంటుంది. https://www.youtube.com/watch?v=3Mo3vIVpQxE