కజ్జికాయలు (హోళీ స్పెషల్ రెసిపీ)!
కావలసినవి :-
మైదా - 1 కప్పు
బొంబాయి రవ్వ - 1/2 చెంచా
ఉప్పు - కొద్దిగా
నూనె - కొద్దిగా
తయారీ విధానం :-
మైదా పిండిలో ఉప్పు, రవ్వ, నూనె వేసి చపాతీపిండిలా కలిపి నానబెట్టుకోవాలి.
పూర్లం:- వేయించిన బొంబాయి రవ్వ, పుట్నాలపప్పు పొడి, నువ్వుల పొడి, ఎండుకొబ్బరి పొడి (లేదా) పచ్చికొబ్బరి పొడి, పంచదార, ఏలకుల పొడి ఇవ్వనీ కలిపి ఈ మిశ్రమం సిద్దంగా ఉంచుకోవాలి. అన్ని కలిపి ఎంత ఉంటే పంచదార అంత వెయ్యాలి.
మైదాపిండిని చిన్న పూరీలా వత్తుకుని. ఈ పొడిని అందులో వేసి అంచులకు నీరు రాసి కజ్జికాయల బల్లలో పెట్టి మూతపెట్టి అంచులపైకి వస్తున్న పిండిని తీసి కజ్జికాయలు చేసి ప్రక్కన ఉంచుకొని 4,5 తయారు అయ్యాక.. నూనె కాగాక .. దోరగా వేయించుకుని టిష్యు పేపరు మీద తీసుకోవాలి. చాలాచాలా రుచిగా ఉండే సంప్రదాయ వంటకం ఇది. |