సేమియా కట్లెట్స్!
కావలసిన పదార్థాలు:-
సేమియా - ఒక కప్పు
బంగాళాదుంప - ఒకటి
క్యారట్ - ఒకటి
ఆకుపచ్చ బఠాణీ - మూడు స్పూన్లు
ఉల్లిపాయ ముక్కలు - అర కప్పు
మైదా పిండి - అర కప్పు
అల్లంముక్కలు సన్నగా తరిగినవి - ఒక స్పూను
పచ్చిమిర్చి సన్నగా తరిగినవి - అర స్పూను
జీలకర్ర - అర స్పూను
గరం మసాలా - ఒక స్పూను
పసుపు - చిటికెడు
కొత్తిమీర తరుగు - ఒక స్పూను
ఉప్పు - తగినంత
నూనె - తగినంత
తయారుచేయు విధానం:-
ముందుగా సేమియాను ఒక గిన్నెలో వేసి, ఒక గ్లాస్ నీళ్లు పోసి ఉడికించుకోవాలి, నీళ్లను వడకట్టి సేమియా పక్కన పెట్టుకోవాలి.
బంగాళాదుంపను, క్యారట్ ను కూడా ఉడికించుకోవాలి.
ఉడికిన ఆలు క్యారట్ లను, మాష్ చేసి, బఠాణి గింజలను, ఉల్లిపాయ ముక్కలను, అల్లం , పచ్చిమిర్చి ముక్కలను కలిపాలి.
ఈ మిశ్రమం లో ఉడికించిన సేమియాను, మైదా పిండిని కలిపాలి... తగినంత ఉప్పు, పసుపు, జీలకర్ర, గరం మసాలా కూడా వేసి పిండి గట్టిగా కలుపుకోవాలి.
స్టవ్ మీద బాండీ ఉంచి, నూనె పోసి, ఈ పిండిని చిన్న చిన్న ఉండలు గా చేసుకుని, కట్లెట్స్ గా చేత్తో వత్తుతూ ఒక్కొక్కటిగా నూనెలో వేసి వేయించాలి.
అన్ని కట్లెట్స్ ని గోధుమ రంగులోకి వేయించాలి.
ఒక ప్లేట్ లోకి తీసుకుని, కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేయాలి.
-Bhavana |