వెజ్ నగెట్స్
కావలసిన పదార్థాలు:
ఉడికించిన బంగాళాదుంపలు - ఆరు
బీన్న్ ముక్కలు - పావుకప్పు
క్యారెట్ ముక్కలు - అరకప్పు
ఉల్లిపాయ ముక్కలు - పావుకప్పు
పచ్చి బఠాణీ - పావుకప్పు
సన్నగా తరిగిన కొత్తిమీర - పావుకప్పు
స్వీట్ కార్న్ - పావుకప్పు
తరిగిన పచ్చిమిర్చి - రెండు చెంచాలు
అల్లం వెల్లుల్లి పేస్ట్ - రెండు చెంచాలు
కార్న్ ఫ్లోర్ - పావు కప్పు
మిరియాల పొడి - ఒక చెంచా
ఉప్పు - తగినంత
నిమ్మరసం - ఒక చెంచా
బ్రెడ్ పొడి - అరకప్పు
నూనె - వేయించడానికి సరిపడా
తయారీ విధానం:
కార్న్ ఫ్లోర్ లో నీళ్లు వేసి చిక్కగా కలిపి పక్కన పెట్టుకోవాలి. బంగాళాదుంపలను ఒలిచి, మెత్తగా చిదుముకోవాలి. ఓ బౌల్ లో బంగాళాదుంప ముద్ద, అన్ని కూరగాయలు, స్వీట్ కార్న్, పచ్చిమిర్చి, ఉప్పు, మిరియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, నిమ్మరసం వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని కొద్దికొద్దిగా తీసుకుని నగెట్స్ షేప్ లో చేసుకోవాలి. వీటిని స్వీట్ కార్న్ మిశ్రమంలో ముంచి తీసి, బ్రెడ్ పొడిలో దొర్లించి, నూనెలో డీప్ ఫ్రై చేసుకోవాలి.
-sameera
|