ఎగ్ బోండా
కావలసిన పదార్థాలు:
గ్రుడ్లు - 4
శనగపిండి - 2 కప్పులు
కారం - ½ టీ స్పూన్
ఉప్పు - తగినంత
వంట సోడా - ¼ టీ స్పూన్
మిరియాల పొడి - 1 టేబుల్ స్పూన్
నూనె - వేయించడానికి సరిపడా
తయారుచేసే విధానం:
ముందుగా గ్రుడ్లు ఉడకపెట్టుకొని, పొట్టు తీసి పక్కన పెట్టుకోవాలి. ఒక గిన్నెలో శనగపిండి, ఉప్పు, కారం, వంట సోడా తీసుకొని, నీళ్ళు పోసి బజ్జీల పిండిలా జారుగా కలుపుకోవాలి. పోట్టుతీసిన గ్రుడ్లను రెండు ముక్కలుగా కట్ చేసి మిరియాల పొడి చల్లుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన బాణలి పెట్టి, నూనె పోసి వేడిచేయాలి. గ్రుడ్లను శనగపిండిలో ముంచి వేడెక్కిన నూనెలో వేసి బంగారు రంగు వచ్చే వరకు వేపుకోవాలి. వీటిని టొమాటో సాస్ తో వడ్డిస్తే పిల్లలు ఇష్టంగా తింటారు.
- రమ
|