Watch Video How To Make Aa Kakarakaya Pulusu Fry Recipe..
Recipe of Aa Kakarakaya Pulusu Fry
Aa Kakarakaya Pulusu Fry
Directions | How to make  Aa Kakarakaya Pulusu Fry
ఆ కాకరకాయ వేపుడు
కావలసిన పదార్థాలు:
ఆ కాకరకాయలు - 1/2 kg
ఉల్లిపాయలు - 2 చిన్నవి
జీలకర్ర - 1/8 స్పూన్
ధనియాలపొడి - 1/2
ఆమ్ చూర్ - 1/4
పసుపు - కొద్దిగా
కారం - 1/4 స్పూన్
ఉప్పు - రుచికి తగినంత
నూనె - తగినంత
తయారుచేసుకునే విధానం:
ముందుగా ఆ కాకరకాయలు కడిగి పైన కొద్దిగా పొట్టు తీసేసి పొడవుగా నిలువుముక్కలు తరుగుకోవాలి. ముదిరిన గింజలు గుచ్చుకుంటాయి వాటిని తీసివేసుకోవాలి.
ఇప్పుడు ఒక బాణలి తీసుకొని అందులో కొద్దిగా నూనె వేసి అది కాగాక జీలకర్ర వేసి ఈ ముక్కలు మూకుడులో వేసి మూతపెట్టి మగ్గనివ్వాలి.
10 నిమిషాలలో కదుపుతూ ఉప్పు పసుపు జోడించాలి. పూర్తిగా వేగాక స్టౌవ్ ఆఫ్ చేసి సర్విం గ్ బౌల్ లోకి తీసుకోవాలి
అదే మూకుడులో కొద్ది నూనె వేసి నిలువుగా సన్నగా తరిగిన ఉల్లిముక్కలు వేసి 5 నిమిషాలు మూత పెట్టి మగ్గనిచ్చి..ధనియాలపొడి, ఆమ్ చూర్ పొడివేసి కారంపొడి కూడా వేసి అన్నీ ఉల్లిముక్కలకు పట్టేటట్లు కలిపి వీటిని ఆకాకర ముక్కలపై వేసి అలంకరించుకోవాలి.
వడ్డించేటప్పుడు అడుగునుంచి తీసి వడ్డిస్తే ఆకాకర ముక్కలు కమ్మని రుచితో పైన ఉల్లిముక్కలు ఉప్పుగా , పుల్లగా ఆ రెండు రుచులు అన్నంలో కలుపుకుని తింటే చాలా రుచిగా ఉంటుంది.