కొర్ర బియ్యంతో చెక్కర పొంగలి
(Dasara Special Pongal)
కావలసిన పదార్దాలు :-
కొర్ర బియ్యం - 1/2కప్పు
పెసరపప్పు - 1/2 కప్పు
నెయ్యి - 4 స్పూన్
డ్రై ఫ్రూట్స్ - 1/4 కప్పు
ఇలాచీ పౌడర్ - చిటికెడు
మిల్క్ మెయిడ్ - 200 గ్రాములు
తయారు చేసే విధానం:-
విడివిడిగా కొర్రబియ్యం, పెసరపప్పు కడిగి నానబెట్టు కోవాలి. ఇప్పుడు బాణలిలో ౩ చెంచాలు నెయ్యి వేసి... నేతిలో డ్రైఫ్రూట్స్ వేయించి అందులో నానిన పెసరపప్పువేసి కమ్మని వాసనా వచ్చే వరకు వేయించుకోవాలి. ఆ తరువాత కొద్దిగా నీరుపోసి పెసరపప్పు... సగంపైన ఉడికిన తరువాత కొర్రబియ్యం వేసి మరి కొద్ది నీటిని జోడించి.... రెండు పూర్తిగా ఉడికిన తరువత ఇలాచీ పౌడర్, మిల్క్ మెయిడ్ వేసి 1 స్పూన్ నేతిని జోడించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చాలా రుచిగా ఉండే కొర్రబియ్యం చెక్కర పొంగలి రెడీ అయిపోయినట్లే.... దీనిని పాలతో ఉడికించి బెల్లం తరుగు (లేదా) చెక్కర కూడా కలుపుకోవచ్చు .
|