మటన్ సూప్
కావలసిన పదార్థాలు..
మటన్ మూలుగ ఎముకలు - కిలో
బోన్ లెస్ మటన్ - 200 గ్రా
పలావు ఆకులు - 2
ఉల్లిపాయలు - 2
అల్లం వెల్లుల్లి - ఒక స్పూన్
నెయ్యి - ౩ టేబుల్ స్పూన్లు
ఉప్పు - రుచికి సరిపడా
కొత్తిమీర - కట్ట
పుదీనా - కట్ట
తయారుచేసే విధానం :
ముందుగా మటన్ ఎముకల్ని మంచినీళ్ళతో శుభ్రంగా కడగాలి. వెడల్పాటి పాన్ లో ఇప్పుడు బోన్ లెస్ మటన్ తీసుకొని శుభ్రంగా కడిగి ఆ ముక్కల్ని, ఎముకలు ముక్కలు, ఉప్పు, పలావు ఆకులు, పెద్ద ఉల్లిముక్కలు వేసి నాలుగు లీటర్ల నీళ్ళుపోసి అవి సగం అయ్యేవరకూ మరిగించాలి. అలా మరిగిన తరువాత.. వడగట్టి ముక్కల్ని బయటకు తీసి చిన్న ముక్కలుగా కట్ చేసి సూప్ లో వేయాలి. ఆ తరువాత కొత్తిమీర, పుదీనా తురుము వేసి పది నిముషాలు మరిగించాలి. బాణలిలో నెయ్యి వేసి ఉల్లిముక్కలు, వెల్లుల్లి వేసి వేయించి సూప్ లో కలిపి మళ్ల్లీ ఐదు నిముషాలు మరిగించాలి. చివరగా కొత్తిమీరతో అలంకరించాలి.
|