ద్రాక్ష హల్వా!
కావలసిన పదార్ధాలు :-
నల్లద్రాక్షలు - వంద గ్రాములు
మైదా - పావుకేజీ
పంచదార - పావుకేజీ
జీడిపప్పుల ముక్కలు - 1 టేబుల్ స్పూన్
బాదం పప్పుల ముక్కలు -1 టేబుల్ స్పూన్
తయారుచేసే విధానం:-
ముందుగా మైదాపిండిలో కొద్దిగా నీళ్ళుపోసి ముద్దలా కలపాలి. కలిపిన ముద్దలో మూడు కప్పుల నీళ్ళు పోసి పూర్తిగా నీళ్ళలో కలిసేలా బాగా కలిపి పక్కన పెట్టాలి (మైదా పాలుగా అవ్వటానికి) అరగంటకి కలిపిన మైదాలో నీళ్ళు పైకి తేరుకుంటాయి.తేరుకున్న నీరు తీసేస్తే, అడుగున మైదా పాలు వుంటాయి.
ద్రాక్షలో గింజలు తీసి మిక్సి లో వేసి జ్యూస్ లా చేసి ఉంచాలి.
ఇప్పుడు స్టవ్ మీద మందపాటి బాండి పెట్టి పంచదార, కొద్దిగా నీళ్ళు పోసి పాకం పట్టాలి. తీగ పాకం వచ్చాక మైదా పాలు, ద్రాక్ష జ్యూసు వేసి కలపాలి. మాడిపోకుండా కలుపుతుండాలి.
ఇది గట్టిపడి ముద్దలా అవ్వుతుంది. ఇప్పుడు నెయ్యి వేసి కలపాలి. మైదాపాలు, ద్రాక్ష రసం, పంచదార, నెయ్యి బాగా కలిసి ముద్దలాఅయి బాండి అంచులు విడుతుంది. అంటే హల్వా తయార్ అయ్యినట్టే.
ఒక ప్లేటుకి నెయ్యి రాసి దానిలోకి తయారయిన హల్వాను వేసి సమంగా సర్ది, జీడిపప్పు ముక్కలు, బాదం ముక్కలు అద్దుకుంటే ద్రాక్ష హల్వా రెడి. చల్లారక ముక్కలుగా కట్ చెయ్యాలి. |