టమాట హల్వ!
కావలసినవి పదార్ధాలు :
ఎర్రని టమాటాలు - ఆరు
నెయ్యి - అరకప్పు
పంచదార - కప్పు
రవ్వ - అర కప్పు
బాదం, జీడిపప్పులు - అర కప్పు
యాలకులు పొడి - టీ స్పూన్
తయారుచేయు విధానం :
* ముందుగా టమాటాలు శుభ్రంగా కడిగి వాటిని ఉడకబెట్టుకోవాలి.
* ఇప్పుడు అందులో ఉన్న నీటిని వంపి.. మిక్సిలో గుజ్జుగా చేసి పక్కన పెట్టాలి.
* స్టవ్ వెలిగించి ఒక బాణలి తీసుకొని అందులో నెయ్యి వేసి అది కాగాక జీడిపప్పులు, బాదం పప్పులు దోరగా వేపి ప్లేట్లోకి తీసుకోవాలి.
* ఇప్పుడు అదే నెయ్యి లో రవ్వ వేసి దోరగా వేపి, దానిలో రెండు కప్పుల నీళ్ళు పోసి వుడకనివ్వాలి.
* రవ్వకాస్త గట్టిపడగానే టమాట గుజ్జు, పంచదార వేసి కలపాలి, బాగా చిక్కబడిన తరువాత యాలుకల పొడి, వేయించిన జీడిపప్పు, బాదం పప్పు, మిగిలిన నెయ్యి వేసి కలిపి ముద్దగా అయ్యిన తరువాత స్టవ్ ఆపాలి.
* ప్లేటుకి నెయ్యిరాసి ఈ మిశ్రమం వేసి సమంగా చేసి ముక్కలు కట్ చేసుకోవాలి. అంతే టమాట హల్వ రెడీ. |