బెల్లం ఆవకాయ
ఆవకాయలు పెట్టటం మొదలుపెడితే వెరైటిలు పెట్టచ్చో కదా. నువ్వుల ఆవకాయ, వెల్లుల్లి ఆవకాయ. అలాగే కొంతమందికి ఆవకాయ తియ్యగా ఉంటే నచ్చుతుంది. ఆ తీపి ఆవకాయ అన్నంలోకి మాత్రమే కాదు ఇడ్లీలు, దోసలలో నంచుకున్నా భలే టేస్టీగా ఉంటుంది. మరి దాని ఎలాగో చూద్దామా.
కావాల్సిన పదార్థాలు:
మామిడికాయలు - 5
బెల్లం - 1/2 కేజీ
ఆవపొడి - ఒక పెద్ద గ్లాసుడు
కారం - అర గ్లాసు
ఉప్పు - పావు గ్లాసు
పసుపు - చిటికెడు
ఇంగువ - రుచికి తగినంత
తయారీ విధానం:
మామిడి ముక్కలను శుభ్రంగా తుడుచుకొని ఉంచాలి. బెల్లాన్ని తురిమి పెట్టుకోవాలి. ఒక పెద్ద బేసిన్ లో ఉప్పు, కారం, ఆవపిండి కలుపుకోవాలి. అందులో కాస్త పసుపు, ఒక అరచెంచా ఇంగువ కూడా వేసి అంతటిని బాగా కలుపుకోవాలి. ఆ కలిపిన పొడిలో కాస్త నువ్వుల నూనె వేసి మామిడి ముక్కలు వేయాలి. ఇప్పుడు తురిమి పెట్టుకున్న బెల్లాన్ని కూడా వేసి అంతటిని బాగా కలుపుకోవాలి. ఇలా తయారుచేసుకున్న బెల్లం ఆవకాయ రెండో రోజుకి కాస్త ఊరి పల్చగా మారుతుంది. ఇది ఇంకాస్త జ్యూసిగా అవ్వాలంటే ఒక గ్లాసుడు నీళ్ళు బాగా మరిగించి చల్లారాకా ఆవకాయలో కలిపి ఒక రోజు ఎండలో పెడితేచాలు ఎన్నాళయినా పాడవకుండా ఉంటుంది.
- కళ్యాణి
|