మాంగో డిలైట్
మామిడిపళ్ళంటే ఇష్టపడని పిల్లలుండరు.మాంగోతో వెరైటీ రుచులు తయారుచేసి ముందుంచితే వాళ్ళని ఆపటం కష్టమే. ఈ మాంగో డిలైట్ తయారుచేసి వాళ్ళకి పెట్టి చూడండి ఎగిరిగేన్తేస్తారు వాళ్ళు. దీని తయారి విధానం ఎలాగో చూద్దామా.
కావాల్సిన పదార్థాలు:
మామిడి రసం - 1 కప్పు
కొబ్బరి పాలు - 1 కప్పు
కస్టర్డ్ పౌడర్ - 11/2 స్పూన్
పంచదార - 3 స్పూన్స్
సగ్గనా తరిగిన మామిడిపండు ముక్కలు - 1/2 కప్పు
తయారీ విధానం:
స్టవ్ వెలిగించి పేన్ పెట్టి కొబ్బరి పాలు పంచదార వేసి పంచదార కరిగే దాకా తిప్పుతూ ఉండాలి. తరువాత కస్టర్డ్ పౌడర్ ను కొన్ని పాలల్లో కలిపి ఉండలు కట్టకుండా చూసి దానిని కూడా కొబ్బరి పాల మిశ్రమంలో పొయ్యాలి. అది పేస్టులా అయ్యాకా స్టవ్ ఆపాలి. అందులో ఇప్పుడు మామిడిపండు రసం వేసి బాగా కలిసేలా తిప్పాలి. అందులో మామిడి ముక్కలను వేసి కలిపి గ్లాసుల్లో పోసి ఫ్రిడ్జ్ లో కాసేపు ఉంచాలి. సర్వ్ చేసే ముందు కావాల్సిన వారు క్రీమ్ తో మంగో డిలైట్ ని గార్నిష్ చేసుకోవచ్చు. అంతే సింపుల్ గా 15 నిమిషాల్లో తయారయిపోయే మాంగో డిలైట్ రెడీ.
..కళ్యాణి
|