కాజు కట్లెట్!
పండగ సీజన్లో ఎవరో ఒకరు వస్తూనే ఉంటారు. వచ్చిన వాళ్లకి మనమే స్వయంగా చేసిన స్వీట్లు తినిపిస్తే అదొక ఆనందం. అందులోనూ రెగ్యులర్ స్వీట్స్ కాకుండా ఇంకొచెం వెరైటీగా కనిపించాలంటే జీడిపప్పుతో కట్లెట్స్ చేసుకోవచ్చు. అవి ఎలా తయారుచేసుకోవాలో చూద్దాం.
కావాల్సిన పదార్థాలు:
జీడి పప్పు - ఒక కప్పు
పాలు - పావుకప్పు
పంచదార - పావుకప్పు
నెయ్యి - 2 చెంచాలు
నచ్చిన ఎస్సెన్స్ - కొన్ని చుక్కలు
కిస్మిస్లు - కొద్దిగా
తయారి విధానం:
ఈ సీట్ తయారుచేయటానికి ముందుగా జీడిపప్పుని ఒక గంటసేపు వేడి నీళ్ళల్లో నానబెట్టి ఉంచాలి. తరువాత నీళ్ళల్లోంచి తీసేసి మిక్సిలో మెత్తగా రుబ్బుకోవాలి. ఆ మిశ్రమంలో పాలు, పంచదార వేసి బాగా కలపాలి. అలా కలిపినా మిశ్రమాన్ని స్టవ్ వెలిగించి సిమ్ లో పెట్టి ఒకా కడాయిలో వెయ్యాలి. అలా తిప్పుతూ అంతా దగ్గరపడ్డాకా అందులో మనకి నచ్చిన ఎస్సెన్స్ వేసుకుని కలిపి, నేయి రాసిన ప్లేట్ లోకి తీసెయ్యాలి. ఆరిన తరువాత మనకి నచ్చిన షేప్ లో కట్ చేసుకోవటమే. తేలికగా అయిపోయే కాజు కట్లెట్స్ రెడీ.
...కళ్యాణి |