ఆనపకాయ మిల్ మేకర్ (కర్రీ )
కావలిసిన పదార్ధాలు:
ఆనపకాయముక్కలు ఉడికించినవి - 1 కప్పు
మిల్ మేకర్ - 1/2
ఉల్లిపాయలు -2
టమాటాలు -2
పచ్చిమిర్చి -1
జీలకర్ర- 1/2 స్పూన్
పసుపు- 1/2 స్పూన్
వెల్లుల్లి పాయలు - 6
ఉప్పు - తగినంత
కారం - తగినంత
గరంమసాలా - 1/2 స్పూన్
నూనె -4 చెంచాలు
చింతపండు రసం - కొద్దిగా
తయారి విధానం:
ఆనపకాయ ముక్కల్ని కాస్త పెద్దగా క్యూబ్స్ లాగా తరుగుకొని ఉడికించాలి .మిక్సీలో ఉల్లి, టమాటా ముక్కల్ని మెత్తని గుజ్జుగా రుబ్బుకోవాలి ప్రక్కన వెల్లుల్లి, జీలకర్ర దంచి మరీ మెత్తగా కాకుండా సిద్ధం చేసుకోవాలి దళసరి గిన్నె (లేదా) మూకుడు వేడిచేసి అందులో నూనెవేసి కాస్త జీలకర్ర, పచ్చిమిర్చి నిలువుగా తరిగిన ముక్కలు, కరివేపాకు వేసి, వెల్లుల్లి ముద్దవెయ్యాలి కొద్దిగా వేగనిచ్చి ఉల్లి, టమాటా గుజ్జువేసి చింతపండు రసం, పసుపు, ఉప్పు జోడించి మూతపెట్టి మగ్గనివ్వాలి. ఈలోగా వేడినీటిలో మిల్ మేకర్ నానబెట్టి.. నీరు వార్చేసి ఆ మిల్ మేకర్స్ వేసి కలిపి చివరగా ఉడికించిన ఆనపముక్కలు కలిపి, గరంమసాలా వేసి చక్కగా అన్నీ కలుపుకుని మరో 10నిముషాలు చిన్న మంటపై ఉడికించుకోవాలి కూర పలుచగా పులుసుగా కావాలి అనుకుంటే మరికొన్ని నీళ్ళు జోడించి ఉడికించుకుని కాస్త దగ్గర పడగానే స్టవ్ ఆఫ్ చేసి కొత్తిమీరతో అలంకరించుకోవాలి. ఈ గ్రేవి ఇంకా బావుండాలి అనుకొంటే జీడిపప్పు పొడి లేక ముద్దని, టమాట ఉల్లిగుజ్జుతో జోడించి ఉడికించుకోవాలి. చాలా రుచిగా ఉండే ఈ కూర చపాతిలతో, జీరారైస్ లోకి చాలా చాలా బావుంటుంది.
|